contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

కేసీఆర్ వద్ద కౌరవులు .. కాంగ్రెస్ పార్టీలో పాండవులు ఉన్నారు: రేణుకా చౌదరి

తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద కౌరవులు ఉంటే.. తమ పార్టీలో పంచ పాండవులు ఉన్నారని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. బతుకమ్మ పేరుతో బొంతకు కూడా పనికిరాని చీరలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని అన్నారు.

ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముత్తపురం, నిమ్మవాగు చెరువు, కిన్నరసాని వరద బాధిత రైతులకు యూరియా బస్తాలను రేణుకా చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌‌ ఇద్దరూ తోడుదొంగలేనని ఆరోపించారు. తెర ముందు నాటకలేస్తారని విమర్శించారు. ‘‘కేసీఆర్ ఎన్ని కథలు చెప్పారు. మాటలు కోటలు దాటిపోయాయి. పోడు భూములను కూర్చీ వేసుకుని తానే ఇస్తానని అన్నారు. వచ్చారా? ఎప్పుడైనా?” అని ప్రశ్నించారు.

మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని రేణుకా చౌదరి ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్న వారికి స్వాగతం పలుకుతామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను తుమ్మల అభివృద్ధి చేశారని చెప్పారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :