రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలం: బతుకమ్మ పండుగ నేపధ్యంలో కందికట్కూర్ గ్రామంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి శ్రీనివాస్ వీది దీపాలను అందజేశారు. మొత్తం 100 వీధి దీపాలు(లైట్లు), 4 హెవీ లైట్ల ను పంచాయకీ కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే లైట్లను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచనమేరకు ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యత గా భావిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అమర్ గౌడ్, సీనియర్ నాయకులు రోషల్ గౌడ్, కాంగ్రెస్ నేతలు వెలిశాల శ్రీనివాస్,దొమ్మాటి భాగ్య, దేవవ్వ లక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
