సంగారెడ్డి : రేగోడ్ మండల పరిధిలోని జగిరాల గ్రామానికి చెందిన బోయిని బక్కయ్య పశువులు ఉదయం పిడుగుపాటుకు మరణించాయి. తెల్లవారుజామున మండల పరిధిలో ఉరుములు జల్లులతో మోస్తారు వర్షం కురిసింది. ఈ క్రమంలో ఉదయం 6:30 సమయంలో జగిరాల గ్రామంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ఒక లేగ దూడ పశువుల కోటంలో అక్కడికక్కడే మరణించాయి. కళ్ళముందే ఇన్నాళ్లు తనకు వ్యవసాయంలో చేదోడుగా ఉన్న పశువులు మరణించడంతో రైతు బక్కయ్య కుటుంబంలో విషాదం నెలకొంది.
