మల్లాపూర్ మండలం వాల్గోండ తండాలో ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధరంసోత్ సురేందర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ప్రతి మహిళకు చీర అందించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వాల్గోండ తండా ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయిక్ మాట్లాడుతూ… రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటివి మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నారని, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అర్హులైన వారందరికీ చీరలు పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాల్గోండ ఉప సర్పంచ్ పనాస స్వామి, వీఓ అధ్యక్షరాలు దుబాక రాధ, విఓఏ బొర్రగల్ల శ్రీనివాస్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.








