సిద్దిపేట జిల్లా: చిన్నకోడూరు మండలం చందలాపూర్ లో విద్యుత్ షాక్ తగిలి తండ్రీకొడుకులు మృతి చెందారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మూర్తి గజేందర్ రెడ్డి తో పాటు అతడి కొడుకు రాజేందర్ రెడ్డి పొలంలో అడివి పందుల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రక్షణగా వైరు కడుతున్నారు. ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ కి వైరు తగలడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. నాలుగు రోజుల క్రితమే గజేందర్ రెడ్డి తన కూతురు పెళ్లి ఘనంగా చేశాడని, ఇంతలోనే విషాదం జరిగిందన్నారు. కాగా కరెంట్ షాక్ తగిలి మూర్తి గజేందర్ రెడ్డి సం(60), ఆయన కొడుకు మూర్తి విజేందర్ రెడ్డి సం(27) మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
