తెలంగాణలో ఇలాంటి కేసు మొదటిసారిగా బయటపడింది. అతడు తనకు ఇష్టమైన బ్రాండ్‌ను అదేపనిగా తీసుకోవడం ద్వారా ఆల్కహాల్ అలర్జీకి లోనయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
మద్యం ప్రియులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. దేశంలో ‘ఆల్కహాల్ అలర్జీ’ వ్యాధి బయటపడింది. ఆగ్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త కొన్ని రోజుల క్రితం శారీరకంగా మార్పులు రావడం గమనించాడు.
శరీరంపై దద్దుర్లు రావడం, తల తిరగడం, పొడి దగ్గు , ముఖం ఎర్రబడటం వంటి లక్షణాలు బయటపడడంతో డాక్టరును సంప్రదించాడు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్ లోని అశ్విని అలర్జీ సెంటర్ లో చికిత్స చేయించుకున్నాడు. అక్కడ ఆల్కాహాల్ ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ చేశారు. రిపోర్టుల్లో వ్యాపారికి ఆల్కాహాల్ అలర్జీ పాజిటివ్ గా తేలింది. అలాగే అన్ని అవయవాలను చెక్ అప్ చేయించారు. అతడు ఉన్న కండీషన్లో ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు.
తెలంగాణలో ఇలాంటి కేసు మొదటిసారిగా బయటపడింది. అతడు తనకు ఇష్టమైన బ్రాండ్‌ను అదేపనిగా తీసుకోవడం ద్వారా ఆల్కహాల్ అలర్జీకి లోనయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. డైల్యూట్ చేయకుండా ఆల్కహాల్ తీసుకోకూడదని, మద్యం సేవించే సమయంలో హిస్టామిన్ ఫుడ్, స్నాక్స్ ను తీసుకోకూడదని డాక్టర్లు హెచ్చరించారు. అలర్జీ అనిపించే ఆల్కాహాల్‌కు దూరంగా ఉండాలని.. కార్క్ ఆధారిత మూతలతో ఉన్న బ్రాండ్ లను సేవించకూడదని వైద్యులు సూచించారు. ఈ విధంగా గుర్తించబడని అలర్జీ కేసులు చాలా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.