కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా ఆయా గ్రామాల్లో వినాయక విగ్రహాలు నెలకొల్పేవారు తప్పనిసరిగా ఆయా శాఖల పర్మిషన్ తీసుకోవాలని గన్నేరువరం ఎస్సై చందా నరసింహారావు సూచించారు. ముందుగా కరెంట్ డిపార్ట్మెంట్, మైక్ పర్మిషన్ కోసం మీ సేవలో డిడి తీయాలన్నారు. గ్రామ పంచాయతి నుండి అనుమతి పత్రాలలో పాటు ఆన్లైన్లో సరైన వివరాలు నమోదు చేసి ప్రింట్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఇస్తుందని తెలిపారు. కావున ప్రజలు, భక్తులు గమనించి ఆన్లైన్ చేసుకొని వినాయక మండపాలకు అనుమతి పొందాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
