సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో అక్కన్నపేట అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లే మెన్ రహదారి పైన మూల మీద ప్రమాద గుంతలు పడి ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. హుస్నాబాద్ లో ఉన్నటువంటి ఆర్ అండ్ బి అధికారులు మరియు స్థానిక మంత్రి వర్యులు పోన్నం ప్రభాకర్ దృష్టిలో ఈ సమస్య ఉన్న పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ ప్రజా సమస్యను వెంటనే తీర్చే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని హుస్నాబాద్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తరపున స్థానిక మంత్రి కి అలాగే సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు నియోజకవర్గ ప్రజల తరపున పట్టణ ప్రజల పక్షాన మరియు ఈ రోడ్డు మీద వచ్చిపోయేటువంటి ప్రయాణికుల తరపున బీజేపీ నాయకులు రైనా నాయక్ విజ్ఞప్తి చేశారు.
