తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా ఎల్. సుబ్బ రాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా ఎస్పీ కి జిల్లా అదనపు ఎస్పీలు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ మంచి పోలీసింగ్ ను అమలు చేసి, తిరుపతి జిల్లా ప్రతిష్టతను పెంపొందింప చేస్తామన్నారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం అన్నారు. అదేవిధంగా శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, శాంతి భద్రతల పరిరక్షణకు మరింత పటిష్టంగా పనిచేస్తామన్నారు. ప్రజలు, పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చట్టానికి లోబడి పోలీస్ శాఖ పనిచేస్తుందని. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.
