గౌహటి : 22 వ జాతీయ పారా స్వమ్మింగ్ పోటీలు ఈ నెల 11 నుండి 13 వ తారీకు వరకు గౌహటి లో నిర్వహించండం జరిగింది. ఈ పోటీల్లో నిజామాబాద్ జిల్లా కు చెందిన క్రీడాకారుడు శ్రీనికేష్ కిరణ్ కాష్కట్ వార్ మూడు పథకాలు సాధించి సత్తా చాటారు . 400 మీటర్ల ఫ్రీ స్టైల్, 50 మీ. బ్యాక్ స్ట్రోక్ లో రెండు బంగారు పతకాలు, 50 మీ బ్రెస్ట్ స్ట్రోక్ లో వెండి పతాకం సాధించారు. పలు సంఘాల నాయకులు అభినందించారు.
