తమిళనాడులోని పారిశ్రామిక నగరం హోసూరులో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. కృష్ణగిరి జిల్లాలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. హోసూరులో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ఈ కీలక విషయాన్ని ప్రకటించారు.
ఈ సదస్సు వేదికగా తమిళనాడు ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. మొత్తం 92 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రాష్ట్రానికి రూ.24,307 కోట్ల పెట్టుబడులు రానున్నాయని స్టాలిన్ తెలిపారు. ఈ ఒప్పందాల ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 49,353 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పారిశ్రామిక, వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో 53 పెద్ద కంపెనీలతో రూ.23,303 కోట్లకు, ఎంఎస్‌ఎంఈ శాఖ ద్వారా 39 సంస్థలతో రూ.1003.85 కోట్లకు ఒప్పందాలు జరిగాయి.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ మాదిరి తాను తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ఉంటాయని అన్నారు. గతంలో ఒక చిన్న పట్టణంగా ఉన్న హోసూరు, నేడు దేశవిదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే స్థాయికి చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.400 కోట్లతో అధునాతన ఐటీ పార్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇటీవలే జర్మనీ, ఇంగ్లండ్ పర్యటనల ద్వారా రూ.15,516 కోట్ల పెట్టుబడులు సాధించామని, ఆ ఉత్సాహంతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా, 8,000 మందికి ఉపాధి కల్పించేలా రూ.1600 కోట్ల విలువైన నాలుగు కొత్త పథకాలకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. తమ నాలుగన్నరేళ్ల పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 77 శాతం ఇప్పటికే ఫ్యాక్టరీల రూపంలో కార్యరూపం