contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Brave Soldier : వీలయితే ఒక్క సారి చదవండి .. మీ కళ్ళల్లో నీరు తెప్పిస్తుందేమో !

మీకు కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కధ.ఆర్మీ అధికారికి ఓ వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది. అందులోని విషయం ఇలా ఉంది …

అయ్యా!
నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తూ రిటైర్ అయ్యాను. నా కొడుకు ఆర్మీ లో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధం లో వీరమరణం పొందాడు. ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాము.
అనుమతి ఇస్తే సంతోషము , అలా కుదరదు మీ ఉద్యోగాలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు.

ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తడిచాయి వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి. అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీచేశారు. ఆ వృద్ధ దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్నవారంతా వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు. ఎందుకు బాబు నువ్వు మాత్రం ఇలా నువ్వు ఎంత పెద్ద అధికారివి అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు. అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వారు నేను మీ అబ్బాయితో కలిసి పని చేసాను. అని ఒక నిమిషం మాటలురాక నిలబడిపోయాడు. పర్లేదు బాబు ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు నేను ఏడవను అని చెప్పాడు. మీరు కాదు నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.

Kargil War: Victory of righteousness over deceit - Defence Info

ఆనాడు పాకిస్థానీలతో యుద్ధం జరుగుతున్నది మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వచ్చాను. అప్పుడు మీ కొడుకు నన్ను లాగి .. నీకు పిచ్చా నీకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్లి ఆ తూటాలను తన శరీరంలో తీసుకున్నాడు.  శత్రువులను 13 మందిని చంపి ఇక్కడే మరణించాడు.

అతడిని మొదటగా పట్టుకున్నది నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు పోయింది. శరీరంలో 42 తూటాలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు.  అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డుపెట్టుకుని ఏడ్చేసింది. ఆరోజు నేనే శవాన్ని తీసుకురావలసింది దగ్గర ఉండి అతడిని మోసి ఉండాల్సింది కానీ నాకు వేరే డ్యూటీ వేశారు ఆరోజు అతడి కాళ్లపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా ఋణం తీర్చుకుంటున్నాను అని అన్నాడు.

బాబు నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాము కానీ వాడి మరణవార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలి పెట్టాలని తెచ్చాము కానీ అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని అర్థం అవుతున్నది.  నీకు అభ్యన్తరం లేకపోతే తీసుకో బాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లితండ్రులు.

Kargil Vijay Diwas 2022: 10 Indian Army Heroes of Kargil War India will  Always be Proud

ఇలాంటి కథలు వాస్తవాలు ఇంకెన్నో  ఇవేవి మనకు తెలియవు మనం ఆలోచించను లేము రాజకీయనాయకుడికి పాలాభిషేకం చేసుకుంటూ ..
నటించే హీరోలకు భారీగా కట్అవుట్లు పెట్టుకుని వాళ్ళే దేవుళ్ళని మన సమయాన్ని మన విలువని పోగొట్టుకుంటున్నాము.

ఇలాంటి జవాన్లు ఎంతో మంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు… కనీసం మనం గుర్తించలేక పోతున్నాం .. సహాయం కోరి మీ దగ్గరికి ఎవరైనా వస్తే .. వీలైనంతవరకు సహాయపడండి.

Heroes of Kargil War 1999

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :