వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని తుంకుల్ గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో గత రెండు నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై కళాశాలలోని విద్యార్థినులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థినులు పేర్కొన్నట్లుగా, గత రెండు నెలలుగా వారి తరగతుల్లో ఫ్యాకల్టీ లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “మేము డిజిటల్ క్లాసులు వింటున్నాం, కానీ డౌట్లు వస్తే ఎవరిని అడగాలని? ఫ్యాకల్టీ మాత్రమే మా సమస్యలు పరిష్కరించగలుగుతుంది” అని వారు చెప్పుకొచ్చారు.
కళాశాల ప్రిసిపల్ వారు “డిజిటల్ క్లాసులు చూసి సర్దుకోమని” ఉచితంగా సలహాఇచ్చారని, కానీ ఈ విధానం సరైన పరిష్కారం కాదని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇక, విద్యార్థినులు తమ ఆందోళనను కొనసాగిస్తూ, ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తామని, కలెక్టర్ ఫ్యాకల్టీని నియమించే వరకు నిరసన ఆపే ప్రసక్తే లేదని . అధికారులు స్పందించకపోతే హైవేపై బైఠాయిస్తామని హెచ్చరించారు.