పార్వతీపురం – మద్దెలపాలెం : సాలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 19 నుండి 21 వరకు జగనున్న ఈ జాతర కోసం సుమారు 1240 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు ఆర్టీసీ జిల్లా అధికారి శ్రీనివాస రావు విలేఖరుల సమావేశంలో తెలిపారు. 15 ఏళ్ల తర్వాత జరగనున్న ఉత్సవాలు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆర్టీసీ డిపో మేనేజర్ దుర్గ పాల్గొన్నారు.
