దర్శి డిప్యూటీ తహసిల్దార్ ఏ.వి.రవిశంకర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ నెల 14 – 18 తేదీల మధ్య రవిశంకర్ బ్యాంకాక్ వెళ్లినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇప్పటికే షోకాస్ నోటీసు జారీ చేయడంతో పాటు పాస్పోర్టును కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. పాస్ పోర్టును పరిశీలించగా బ్యాంకాక్ వెళ్లినట్లు తేలింది. రవిశంకర్ కూడా నిజమేనని ఒప్పుకోవడంతో విధుల నుండి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.