- నరసింహం నటనకి 50 ఏళ్లు పూర్తి.
- ఎంతోమందికి ఆదర్శం లక్షలాది క్యాన్సర్ పేషెంట్లకు ఆపద్బాంధవుడు.
పల్నాడు జిల్లా , కారంపూడి : తెలుగుతేజం నట విశ్వరూపం నటసింహం నందమూరి అందగాడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కారంపూడి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసుకొని ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పట్టణ మరియు మండల నాయకులు మాట్లాడుతూ ఒక చరిత్ర సృష్టించాలన్న ఆయనే దాన్ని తిరగరాలన్న ఆయనే. అలాంటి మన నందమూరి బాలకృష్ణ నటనకి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ లక్షలాది క్యాన్సర్ బాధితులకు దేశ చరిత్రలోనే ఒక కొత్త విధానానికి నాంది పలికి లక్షల్లో ఖర్చయ్యే క్యాన్సర్ వైద్యాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందిస్తూ నటనలోనే కాదు ప్రత్యక్షంగానూ దేవుడు లాగా కనిపించే నందమూరి బాలకృష్ణ నటన కి ఎవరు సాటిరారు అంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఆయన మరిన్ని చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు తీయాలని అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా ఎప్పటికి కూడా ఆయన నటన చిరస్థాయిగా నిలిచిపోతున్నాయని రానున్న తరంలో కూడా ఆయన వారసుడు తాతకి తండ్రికి తగ్గ నటనతో రాణిస్తుడని అలాంటి ఆయన ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని ప్రతి అభిమాని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మరియు పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.