ఈరోజు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకెళ్లి, ఆయన మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు స్పీకర్ పై దాడికి యత్నిస్తున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. బల్లలు కొట్టాల్సింది ఇక్కడ కాదని, న్యాయస్థానాల్లో అని ఎద్దేవా చేశారు.దీంతో అంబటిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అంబటిపై మీసం మెలేయడంతో పాటు… ‘దమ్ముంటే రా అంబటీ’ అంటూ సవాల్ విసిరారు. దీనిపై అంబటి స్పందిస్తూ… మీసాలు మెలేయడాలు సినిమాల్లో చేసుకోవాలని సెటైర్ వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో, సభను స్పీకర్ తమ్మినేని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.