contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా అంజనీకుమార్

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లకు పదోన్నతి కలిగింది. డీజీపీ మహేందర్ రెడ్డి ఎల్లుండి (డిసెంబరు 31) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో… ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీకుమార్ రాష్ట్రస్థాయిలో పోలీసు విభాగంలో పలు కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక విభాగం డీజీగా ఉన్నారు. ఆయన స్థానంలో ఏసీబీ డీజీగా రవి గుప్తా నియమితులయ్యారు. రవి గుప్తాకు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.

ఇక, సీఐడీ అదనపు డీజీగా మహేశ్ భగవత్ ను నియమించారు. మహేశ్ భగవత్ ఇప్పటిదాకా రాచకొండ పోలీస్ కమిషనర్ గా కొనసాగుతున్నారు. ఆయన పదోన్నతిపై వెళుతుండడంతో రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్ ను నియమించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపిఎస్ అధికారి 

 • ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు.
 • అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్ గా పని చేశారు
 • ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు.
 • ఐక్యరాజ్య సమితి తరపున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు.
 • బిహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు.
 • ఐపిఎస్ ట్రైనింగ్ లో మంచి ప్రతిభ కనపబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు
 • గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు.
 • కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఛీఫ్ గా పనిచేశారు
 • ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఛీఫ్ గా పనిచేశారు
 • నిజామాబాద్ డీఐజీగా చేశారు
 • వరంగల్ ఐజీగా చేశారు
 • హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గా చేశారు
 • తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు.
 • 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్ గా చేరారు.
 • 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు.
 • రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు.
 • హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :