contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణలో ఇప్పటివరకూ పోలింగ్ అయిన శాతం .. హైదరాబాద్ లో 20% మాత్రమే పోలింగ్

హైదరాబాద్ : సెలవు అయితే తీసుకున్నారు కానీ దేనికోసం అయితే హాలిడే ఇచ్చారో ఆ విషయం మాత్రం మర్చిపోయారని కొంత మంది కథనాలను పబ్లిష్ చేసారు కానీ వాస్తవాలను గ్రహించకుండ తెలంగాణ ప్రజల పై ఆరోపణలు చేయడం సరికాదని గ్రహించాలి . భారతదేశ ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అయిన ఓటును వేయడానికి తెలంగాణాలో ఉన్న కొన్ని ఆంధ్రా వ్యాపార సంస్థలు ఓటర్లకు సెలవు ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచడమే కారణమని తెలుస్తోంది. పోలింగ్ మొదలై ఐదు గంటలు గడుస్తున్నా ఇంకా హైదరాబాద్ లో 20% శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. ఓటు వేయాలని ప్రజలకు ఉన్నా ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వడం లేదు ఆంధ్రా పెత్తందారుల కంపెనీలు. ఇక్కడ తప్పెవరిది ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ముందుగా ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకూ 36.68శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా మేడ్చల్‌లో 26.70 నమోదైనట్లు తెలిపారు.

అచ్చంపేట, జనగామతోపాటూ మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఖమ్మంతో పాటూ మరికొన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఓట్లను బహిష్కరించారు. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో కూడిన ఘర్షణ వాతావరణం నెలకొంది. వీరిని పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల మధ్య పోలింగ్ ఎంత శాతం నమోదైందో జిల్లాల వారీగా ఇప్పుడు చూద్దాం.

  • జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం..
  • హనుమకొండ – 35.29
  • హైద్రాబాద్ – 20.79
  • జగిత్యాల – 46.14
  • జనగాం – 44.31
  • భూపాలపల్లి – 49.12
  • గద్వాల్ – 49.29
  • కామరెడ్డి – 40.78
  • కరీంనగర్ – 40.73
  • ఖమ్మం – 42.93
  • ఆసిఫాబాద్ – 42.77
  • మహబూబాబాద్ – 46.89
  • మహబూబ్‌నగర్ – 44.93
  • మంచిర్యాల – 42.74
  • మెదక్ – 50.80
  • మేడ్చల్ – 26.70
  • ములుగు – 45.69
  • నగర కర్నూల్ – 39.58
  • నల్గొండ – 39.20
  • నారాయణపేట – 42.60
  • నిర్మల్ – 41.74
  • నిజామాబాద్ – 39.66
  • పెద్దపల్లి – 44.49
  • సిరిసిల్ల – 39.07
  • రంగారెడ్డి – 29.79
  • సంగారెడ్డి – 42.17
  • సిద్దిపేట – 44.35
  • సూర్యాపేట – 44.14
  • వికారాబాద్ – 44.85
  • వనపర్తి – 40.40
  • వరంగల్ – 37.25
  • యాదద్రి – 45.07

సాయంత్రం 5:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ – ఈసీ కీలక ప్రకటన
కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని మార్చింది. సాయంత్రం 5:30 తర్వాతే విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. గతంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ కు అనుమతి ఇవ్వగా తాజాగా సవరించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :