తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడుతలుగా సాగిన ఈ యాత్ర ప్రస్తుతం మూడో దశలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తముందన్న కోణంలో ఆరోపణలతో రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. మంగళవారం యాత్రలో ఉన్న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో బీజేపీ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటుగా యాత్రకు తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని ఆ బృందం గవర్నర్‌ను కోరింది. గవర్నర్‌ను కలిసిన బీజేపీ బృందంలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో పాటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తదితరులు ఉన్నారు.
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు
శ్రీ @bandisanjay_bjp ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్
శ్రీమతి @DrTamilisaiGuv గారికి వినతిపత్రం సమర్పించిన బిజెపి తెలంగాణ బృందం#KCRFamilyScaredOfBJP#TRSInLiquorScam pic.twitter.com/sC70gyo5kt— BJP Telangana (@BJP4Telangana) August 23, 2022