సికింద్రాబాద్ లోని మారేడు పల్లి పోలీసు స్టేషన్ కు ఏదో అయ్యింది. ఇటీవలే మారేడ్‌పల్లి సీఐ రేప్, కిడ్నాప్ కేసులో ఇరుక్కోగా ఇప్పుడు తాజాగా ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ పై ఒక దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు.
సికింద్రాబాద్ లోని మారేడు పల్లి పోలీసు స్టేషన్ కు ఏదో అయ్యింది. ఇటీవలే మారేడ్‌పల్లి సీఐ రేప్, కిడ్నాప్ కేసులో ఇరుక్కోగా ఇప్పుడు తాజాగా ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ పై ఒక దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. మారేడుపల్లి పోలీసు స్టేషన్ ఎస్‌ఐ వినయ్‌కుమార్ మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో తన పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓం శాంతి హోటల్ వద్ద నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఆపి… ఎస్‌ఐ వారిని ప్రశ్నించారు. అయితే వారిలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్‌ఐ వినయ్‌కుమార్ కడుపులో పొడిచాడు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో గాయపడిన ఎస్‌ఐని సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులను యాప్రాల్ కు చెందిన వారుగా గుర్తించారు. వారి కోసం నార్త్ జోన్ పోలీసులు గాలిస్తున్నారు.
కాగా, వారంరోజుల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. దొంగలను పట్టుకునేందుకు మఫ్టీలో తిరుగుతున్న సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, గిరిపై దుండగులు కత్తిలో దాడిచేశారు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుల్ యాదయ్య తీవ్రంగా గాయడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.