- విచ్చలవిడిగా బ్లా స్టింగ్ లు బెంబేలెత్తుతున్న చుట్టుపక్కల జనం
- అటువైపు కన్నెత్తి చూడని సంబంధిత ఉన్నతాధికారులు
- జుక్కల్ నియోజకవర్గం లో కొన్ని అనుమతులు లేకుండా నడుస్తున్న క్రషర్లు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: జుక్కల్ నియోజకవర్గం లోని పలు క్రషర్ లలో విచ్చలవిడిగా నిబంధనలు ఏమాత్రం పాటించకుండా కొనసాగిస్తున్న సంబంధిత ఉన్నతాధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పిట్లం, బిచ్కుంద జుక్కల్ నియోజకవర్గం లో పలు ప్రాంతాల్లో క్రషర్లు ఇష్టం వచ్చిన వేళ ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ కొనసాగుతుండడంతో చుట్టుపక్కల రైతులు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. క్రషర్ లలో పాటించవలసిన నిబంధనలు ఏవి పాటించకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ధనార్జనే ధ్యేయంగా కొనసాగిస్తున్న సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే బయటకు రాకుండా చూస్తున్నారని తెరవెనుక చేయాల్సిన అన్ని పనులు చేస్తుండడంతో అటువైపు ఎవరూ కన్నెత్తి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ చుట్టుపక్కల రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న ఏమాత్రం పట్టింపు లేకుండా నిర్వాహకులు తమ ఇష్టారీతిన మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పక్కనే గా గ్రామాలు పలు ఇళ్లకు ముప్పు ఉన్న ఆ వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీని వెనుక ఎవరున్నారో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. నియమ, నిబంధనలు పాటిస్తున్నారా అనుమతులు మేరకే క్రషర్లు కొనసాగుతున్నాయి,v అసలు అసలు ఏం జరుగుతుంది పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. జుక్కల్ నియోజకవర్గం లో కొనసాగుతున్న క్రషర్లు అనుమతులు మేరకు కొనసాగుతున్నాయా, నియమ నిబంధనలు పాటించకుండా నడుస్తున్న చూసీ చూడనట్లు వ్యవహరించడం వెనుక అసలు ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సహజ సంపదను కొల్లగొడుతూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నా ఏ ఒక్క అధికారి స్పందించక పోవడం తో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నా సంబంధిత ఉన్నతాధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న క్రషర్లను వెంటనే మూసివేయించి చుట్టుపక్కల వారికి భయాలను తొలగించాలని సహజ సంపదను కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, స్థానికులు కోరుతున్నారు.