- జెండా ఊపి ప్రారంభించిన కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు
- నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
కరీంనగర్ జిల్లా, ది రిపోర్టర్ టీవీ: కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు శనివారం తిమ్మాపూర్ మండల కేంద్రంలో రాజీవ్ రహదారి నుండి బొడ్రాయి వరకు సాయుధబలగాలు కవాతు (ఫ్లాగ్ మార్చ్) నిర్వహించాయి.
ఈ సందర్భంగా ఏసిపి కరుణాకర్ రావు మాట్లాడుతూ..గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి.ఓటర్లు ఓటు అనే ఆయుధాన్ని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలి.రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు చేసుకోవద్దు అని ప్రతి ఒక్కరు తమ గ్రామానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ గ్రామంగా గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేయాలి అని గ్రామాల్లో డబ్బు, మద్యం, వస్తువులు పంపిణీ చేసిన,నిలువచేసిన తమకు గానీ, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు గానీ ఫిర్యాదు చేయాలి అని అన్నారు. చట్టాన్ని ఎవరు తన చేతిలోకి తీసుకోవద్దు. ఫిర్యాదు చేసిన వెంటనే తప్పకుండా స్పందిస్తాము, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు.గతంలాగే ఈసారి కూడా కేసులు లేని మండలంగా తిమ్మాపూర్ నిలిచేందుకు ప్రతి వ్యక్తి సహకరించాలి. ఎలాంటి ఇబ్బందులుకు గురి చేసినా ఓటర్లు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చు. ఓటర్లతో గాని, కుల సంఘాలతో గాని ప్రమాణాలు చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఓటర్లను ప్రభావితం చేసే పనులు ఎవరు చేయవద్దు.గ్రామాల్లో వివిధ షీట్లలో ఉన్న వారితోపాటు తరచూ గొడవలకు పాల్పడే వారికి, బాండోవర్ అయిన వారికి ఎసిపి కౌన్సిలింగ్ నిర్వహించారు.ప్రతినిత్యం పోలీసులు గ్రామాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారని, తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు.
రాజకీయ పార్టీల నాయకులు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలన్న తప్పకుండా ఎన్నికల అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ కవాతు కార్యక్రమంలో బిఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంజయ్ కుమార్, బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్లు వితిన్ సింగ్, అబయ్ సింగ్, తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి లతోపాటు మనకొండూర్ సిఐ రాజ్ కుమార్, రూరల్ సిఐ ప్రదీప్ కుమార్, చొప్పదండి సిఐ రవీందర్ లు మరియు ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, తోపాటు రురల్ డివిజన్ కు చెందిన ఎస్సైలు నరసింహారావు, రాజేష్, చంద్రశేఖర్, శ్రీకాంత్, తిరుపతి, అభిలాశ్, ఉపేంద్రచారి లతోపాటు పలువురు పోలీసు సిబ్బంది, సాయుధ బలగాల సిబ్బంది, పాల్గొన్నారు.