తిరుపతి జిల్లా, పాకాల మండలం, దామలచెరువు పంచాయతీ పత్తిపాటివారిపల్లి వద్ద గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కమచెరువు పల్లి ఎస్టీ కాలనీకి చెందిన కె. జయచంద్ర మృతి చెండడంతో అతని భార్య కె.నాగవేణి, నలుగురు పిల్లలు అనాధలుగా మారారు. పత్తిపాటి వారి పల్లికి చెందిన యల్. యస్. నాయుడు తన జన్మదినాన్ని పురస్కరించుకొని బాధిత కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. బుధవారం బాధితుల ఇంటి వద్దకు వెళ్ళి మృతుని భార్య కె. నాగవేణి కి రూ. 10 వేలు అందజేశారు. అనంతరం భగవాన్ శ్రీ రామతీర్థ సేవాశ్రమం వద్ధ వృద్ధాశ్రమం లో వృద్దులకు పండ్లు, బిస్కెట్ పాకెట్లను అందజేశారు.