పాకాల: తిరుపతి జిల్లా పాకాల మండలంలో పెద విద్యార్థులకు లైన్స్ క్లబ్ ఆఫ్ పాకాల ప్లాటినం అధ్యక్షులు కే ఎన్ తులసీరామన్ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించింది. “వేము” ఇంజనీరింగ్ కాలేజ్ మూడవ సంవత్సరం చదువుతున్న టీ పవన్ కుమార్ కు లైన్ ఎం.కుప్ప స్వామి నాయుడు 10 వేల రూపాయలు చెక్కును అందించారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న జి.చండీప్రియ కు లైన్ రామయ్య రీజనల్ ఛైర్పర్సన్ 10000 రూపాయల చెక్కును అందించారు. వి బి ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో డైరీ సైన్స్ నందు రెండవ సంవత్సరం చదువుచున్న జి.యశ్వంత్ కు లైన్ ఆర్.వి.ప్రసాద్ డిస్ట్రిక్ట్ ఛైర్పర్సన్ 10000 రూపాయలు అందించారు. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి అవసరమైన విద్యార్థులకు ఇదే విధంగా ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొరస్వామి నాయుడు, భాస్కర్ శెట్టి, భాస్కర మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
