తిరుపతి : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎన్ఎంఆర్ గా ఉంటూ డిఈ, ఈఈ గా పనిచేస్తున్న తాండవ కృష్ణ ఆగడాలకు హద్దుపొద్దు లేకుండా పోతుందని బాధితుడు పర్మినెంట్ ఉద్యోగి అయినా ఏఈ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు తన ఆవేదన ను చెప్పుకున్నారు. తాండవ కృష్ణ బాధ్యతలు చేపట్టిన రోజు నుండి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధపడ్డారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్న తనను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనను శానిటరీ విభాగానికి మార్చడం దారుణమన్నారు. తాండవ కృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు రిజిస్టార్, విసిని అటు యూనివర్సిటీ సంస్థను అన్ని విధాలుగా మోసం చేస్తున్నాడని, యూనివర్సిటీ అభివృద్ధి తోడ్పడాల్సిన తాండవ కృష్ణ కొంతమంది అనుచరులను వెంటబెట్టుకొని ఎస్ వి యూనివర్సిటీని మోసం చేస్తున్న విషయాన్ని తెలియజేశారు. సీనియర్ ఏఈగా అందరి మన్ననలు పొందుతున్న సమయంలో తనను పనిష్మెంట్ కింద శానిటరీ విభాగానికి పంపించి అక్కడ ఆ విభాగానికి తాళాలు వేయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిపై ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టార్ విసి వెంటనే ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయాలని తాండవ కృష్ణ ఆగడాలకు కళ్లెం వేయాలని డిమాండ్ చేశారు. నన్ను దళితుడు అనే నేపంతో నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పాడు. వెంటనే రెండు ఉద్యోగాలు చేస్తూ ఎస్వీ యూనివర్సిటీని అన్ని రకాలుగా మోసం చేస్తున్న తాండవ కృష్ణ పై వెంటనే యూనివర్సిటీ యాజమాన్యం తగు చర్యలు తీసుకొని తన సీనియార్టీని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
