contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

‘రైతు బంధు’ కోసం హరీష్ రావు డిమాండ్ … ఎవరి జేబులు నింపడానికి ?

వ్యవసాయ పెట్టుబడి సాయం రైతుబంధుపై ఇప్పటి వరకు స్పష్టతలేదని, ఈ అంశంపై స్పష్టతను ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుబంధు వెనుక అసలు మర్మమేంటి ? నెల నెలకు రైతు బంధు పథకం కింద ఎన్ని కోట్ల రూపాయలు రైతుల పేరుతో ఖర్చు చేశారు కేసీఆర్ ప్రభుత్వం ? సుమారు రూ.6,889 కోట్లు  రైతు బంధు పేరుతో ఖర్చు చేసారు.

ఎంత భూమి ఉంటే అంత భూమికీ… :

కిసాన్ సమ్మాన్ నిధి కింద ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదిలో గరిష్ఠంగా రూ.6వేలు ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో భూ పరిమాణంతో సంబంధం లేకుండా కిసాన్ సమ్మాన్ నిధి కింద వచ్చే రూ.6వేలకు అదనంగా మరో రూ.7,500, అంటే మొత్తంగా రూ.13,500 అందుతున్నాయి.

తెలంగాణలో రైతు బంధు కింద ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నారు. దీనిపై సీలింగ్ లేదు. భూ పరిమాణం ఎంత ఉంటే, అంత మొత్తానికీ ఆ భూ యజమాని రైతు బంధు కింద పెట్టుబడి సాయం పొందవచ్చు.

తెలంగాణలోని భూ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి పేరిట గరిష్ఠంగా 51 ఎకరాల వరకూ వ్యవసాయ భూమి, 21 ఎకరాల వరకూ బీడు భూమి ఉండొచ్చు.

ఈ లెక్కన 51 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న వ్యక్తి ఖాతాలో రైతు బంధు కింద ఏడాదికి రూ. 5,10,000 పెట్టుబడి సాయం పడుతుంది.

లబ్ధిదారుల్లో మంత్రులు, సినీ ప్రముఖులు:

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులకు, వ్యవసాయాన్ని మానేసి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నవారికి, విదేశాల్లో ఉంటున్నవారికి కూడా రైతు బంధు ద్వారా లబ్ధి జరుగుతోంది.

వారి పేరిట వ్యవసాయ భూమి ఉండటమే ఇందుకు కారణం.

సినీ నటుడు మహేశ్ బాబు కుటుంబానికి కూడా రైతు బంధు కింద ఇదివరకు చెక్కులు వచ్చాయి. వాటిని తిరిగి వాళ్లు ప్రభుత్వానికి అందజేశారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.

కౌలుకు ఇచ్చిన భూములపై రైతు బంధు కింద సాయం పొందుతున్నవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు.

”ఊళ్లో  వ్యవసాయ భూమి ఉంది. కానీ, మేం వ్యవసాయం మానేసి, చాలా రోజులైంది. కొన్నేళ్లుగా భూమిని కౌలుకు ఇస్తున్నాం. రైతు బంధు కింద మాకు డబ్బులు జమ అవుతున్నాయి. వాటిని ఎందుకు వద్దనుకుంటాం?” అని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఉన్నారు.

రైతు బంధు కింద లాభం పొందుతున్నవారిలో ఎక్కువ మంది అసలు రైతులే కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేసారు.

నిజంగా వ్యవసాయం చేసేవారిని వదిలేసి, భూస్వాములకు కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకంతో లాభం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదివరకు రైతు బంధు కింద తన కుటుంబానికి కూడా రూ.3 లక్షలు వచ్చాయని, తనలా ఆర్థికంగా బాగున్నవారికి ప్రభుత్వ సాయం ఎందుకని రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఖాతాల్లో డబ్బులు వేస్తూ రైతులను భిక్షగాళ్లలా చూడటానికి బదులు, వారికి నిజంగా చేయూతనిచ్చే పనులు చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేద, చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

”రైతు బంధు పేరిట ఏటా రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదే డబ్బుతో రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వండి. సబ్సిడీపై ఎరువులు ఇవ్వండి. పంటలకు మద్దతు ధర కల్పించండి. ఈ మూడు పనులు చేస్తే, అసలు రైతులు బాగుపడతారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తే, వ్యవసాయం వదిలేసినవాళ్ల జేబులు నిండుతాయి” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

‘స్వచ్ఛందంగా వదులుకోవచ్చు, సీలింగ్ ఆలోచన లేదు’
రైతు బంధు మొదలైన తర్వాత కొందరు రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆ పథకం కింద తమకు వచ్చిన చెక్కులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు.

అయితే, రానురానూ అలా ప్రభుత్వ సాయాన్ని వెనక్కి ఇస్తున్నవారి సంఖ్య తగ్గిపోతూ వస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.

అవసరం లేని వారికి సాయాన్ని నిలిపివేసే అవకాశం ప్రభుత్వం దగ్గరే ఉన్నప్పుడు ఇంత ప్రయాస ఎందుకని విమర్శలు కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చాయి.

రైతు బంధుపై కొన్ని ఎకరాల వరకూ పరిమితి పెట్టి, ఆ మేరకే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలన్న డిమాండ్లు ఉన్నాయి.

ప్రభావం ఏంటి? :
తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక-2017 ప్రకారం తెలంగాణలో రెండు హెక్టార్ల (సుమారు ఐదు ఎకరాల) కుపైగా వ్యవసాయ భూమి ఉన్నవాళ్లు 14.2%. వీరి ఆధీనంలో 44.6% వ్యవసాయ భూమి ఉంది.

ఈ లెక్కన ఈ 14.2% మందికి రైతు బంధు కింద వచ్చే సాయంలో 44.6% వాటా అందుతుందన్న మాట. మిగతా 55.4% వాటాను 85.8% మంది పంచుకోవాలి.

నాలుగు హెక్టార్ల (సుమారు పది ఎకరాల)కు మించి భూమి ఉన్నవారు 3.3% మంది ఉన్నారు. వీరి ఆధీనంలో 19% భూమి ఉంది. అంటే, రైతు బంధు సాయంలో 19% వాటా వీరికే వెళ్తుంది.

ఈ నివేదికను 2010-11 వ్యవసాయ సెన్సెస్ ప్రకారం రూపొందించారు. కాబట్టి, ఇప్పుడు గణాంకాలు మారిపోయి ఉండొచ్చు.

కానీ, తక్కువ భూమి కలిగిన వారి కన్నా ఎక్కువ భూమి కలిగినవారు ప్రభుత్వ సాయంలో ఎక్కువ వాటా పొందుతున్నారని గణాంకాలు చెప్పాయి . ( కేసీఆర్ ప్రభుత్వంలో )

సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ కౌలు రైతులను ప్రభుత్వం రైతు బంధు నుంచి పక్కనపెట్టిందని ఆరోపణలు ఉన్నాయి.

”కౌలు రైతులకు కనీసం పరోక్షంగానైనా లాభం కలగలేదు . రైతు బంధు డబ్బులు వస్తున్నాయని ఏ భూ యజమానీ కౌలు తగ్గించలేదు. కౌలుకు ఇచ్చిన భూములకు రైతు బంధు ఇవ్వమని కేసీఆర్ చెప్పి ఉంటే, కనీసం ఆ భయంతోనైనా వారికి కాస్త మేలు జరిగేది. కానీ, భూమి ఉన్నవారికే డబ్బులు అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉండేది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :