తిరుపతి జిల్లా – పాకాల మండలం మద్ది నాయనపల్లి పంచాయతీ నందుగల గోకులాపురం ఎస్టీ కాలనీ మద్దినాయన పల్లె హరిజనవాడ గ్రామాలకు ప్రత్యేక రోడ్డు ఏర్పాటు చేయాలని తిరుపతి డివిజనల్ పంచాయతీ అధికారి సురేష్ నాయుడుని గ్రామస్తులు కోరారు గోకులాపురం ఎస్టి కాలనీకి రోడ్డు సౌకర్యం లేదని తమకు రోడ్డు ఏర్పాటు చేయాలని ఆగస్టు 16,2024 జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నిమిత్తం శనివారం గ్రామానికి డి ఎల్ పి ఓ విచారణ నిమిత్తం వచ్చారు స్థానిక పరిస్థితులను పరిశీలించిన డి ఎల్ పి ఓ గ్రామస్తులతో మాట్లాడి వివరాల్లో అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు మద్దినాయన పల్లి గ్రామం నుండి గోకులాపురం ఎస్టి కాలనీ మద్ది నాయన పల్లి హరిజనవాడకు వెళ్లడానికి గ్రామంలో ఇరుకైన దారి ఉండటంతో వాహనాలు గాని అంబులెన్స్ వెళ్లడానికి కానీ బోరు బండ్లు వెళ్లడానికి సౌకర్యం లేదని మద్ది నాయన పల్లి నుండి గోకులాపురం ఎస్టీ కాలనీ వరకు సుమారు మూడు కిలోమీటర్లు దూరం ఉందండి ఎవరికైనా అనారోగ్య సమస్య తలెత్తిన మండల కార్యాలయాలకు వెళ్లాలన్న, బయట ప్రాంతాల్లో మరణించిన వారిని గ్రామాల్లోకి తీసుకురావడానికి రోడ్డు మార్గం లేదని కాబట్టి ప్రభుత్వం మా సమస్యపై చొరవ చూపి భూసేకరణ చేసి రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రావెల్ రోడ్డు గా ఉన్న ఈ రోడ్డుని తారు రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు ఈ కార్యక్రమంలో శశిరేఖ స్థానిక పంచాయతీ కార్యదర్శి అనురాధ గ్రామస్తులు పాల్గొన్నారు.










