తిరుపతి: నారాయణ డీఎస్సీ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తిసుకొని డీఎస్సీ లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన వారికి సోమవారం తిరుపతి తుడా ఆఫీస్ నందు గల కచ్చపి ఆడిటోరియంలో నారాయణ డీఎస్సీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ నారాయణ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ మంత్రివర్యులు పరసారత్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన పెట్టారన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు డీఎస్సీలో 15 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించారన్నారు. గత ప్రభుత్వంలో మాటలు చెప్పారు గానీ చేతల్లో చూపి లేదన్నారు. అదే విధంగా నారాయణ కోచింగ్ సెంటర్ ద్వారా డీఎస్సీలో అనేకమంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారనీ కొనియాడారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన కూటమీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారు పాల్గొన్నారు. డీఎస్సీలో ఉద్యోగ సాధించిన ప్రతి ఒక్కరిని నారాయణ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సన్మానించారు.
