డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఫౌండేషన్ కార్యాలయ ప్రారంభోత్సవం తిరుపతిలోని మారుతి నగర్ నందు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పరసారత్నం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాంఘిక న్యాయ మరియు సాధికార శాఖ సహాయ మంత్రి వర్యులు రాందాస్ బంధు ఆత్వాలే హాజరై ఏ.పి.ఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ ,రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి శివ నాగేశ్వరరావు, ఆంధ్ర తెలంగాణ ఎం. ఎస్.ఎం ఈ చైర్మన్ మంజుల, తిరుపతి మాజీ ఎమ్మెల్యేలు ఏ.మోహన్, సుగుణమ్మలు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్తకళా చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివ రుద్రకోటి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి, మాజీ టూరిజం డైరెక్టర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొని మాజీ మంత్రివర్యులు పరసా రత్నం ఏర్పాటుచేసిన అంబేద్కర్ ఫూలే ఫౌండేషన్ సమాజంలో మార్పుకు నాంది కావాలని కొనియాడారు. అణగారిన వర్గాల అభివృద్ధికి విద్యా వైద్యం,సాధికారత లక్ష్యాలుగా చేసుకుని ఇప్పటికే పలు సేవలు ఏపీఎఫ్ చెయ్యడం అభినందనీయమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం నుండి ఏపీఎఫ్ సంస్థకు అన్ని విధాలుగా చేయూతనిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సాంఘిక న్యాయ మరియు సాధికార సహాయ మంత్రివర్యులు రాందాస్ బందు అత్వాలే మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ఆదర్శనీయమన్నారు. అంబేద్కర్ మహనీయుడు పై పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా పనిచేసిన పరసా రత్నం లాంటి వారు ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ఆదర్శప్రాయమన్నారు.దళిత బహుజన మైనార్టీలకు దేశ ప్రజానీకానికి సామాజిక న్యాయం సాధికారత అందించడానికి అంబేద్కర్ ఫూలే చూపించిన మార్గాలు చైతన్యానికి దోహదపడతాయని తెలిపారు. పలు ప్రజా సంఘాల నేతలు విచ్చేసి మంత్రివర్యుల రామదాస్ బందు అత్వలే, అనగాని సత్య రాసాద్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఎఫ్ సభ్యులు పరస శాలిని, చింతల సతీష్ చంద్ర, కే.కుమార్రెడ్డి, శరత్ బాబు,నీరుగట్టు నగేష్, ఈశ్వరయ్య, మునీంద్ర, జగదీష్, రఘునాథ్ సింగ్, జనసేన నాయకులు నాగార్జున, విజయ్ ఉత్తరాది, ఎం,.నందిని, ఆర్.ఎస్ చౌదరి, డాక్టర్ హరి, తలారి సూరిబాబు, రాజేష్, భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
