పాకాల, తిరుపతి జిల్లా: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని అగ్నిమాపక శాఖ సిబ్బందికి అన్ని అసౌకర్యాలే, కనీసం ఉండడానికి సరైన బిల్డింగ్ లేదు, టాయిలెట్లు సౌకర్యం లేదు అగ్నిమాపక శాఖ సిబ్బంది బాధ చూస్తుంటే వర్ణనాతీతంగా కనబడుతుంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఫైర్ జరిగిన ఎమర్జెన్సీ సర్వీసులు చేసేటువంటి సిబ్బందికి కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కనీస సౌకర్యాలు లేక సిబ్బందిని అడుగడుగునా వెంటాడుతోంది. ప్రస్తుతం మార్కెట్ యార్డ్ పరిధిలో వారికి కేటాయించిన సిమెంట్ రేకుల షెడ్డు దయనీయంగా ఉండటమే కాకుండా కనీసం బాత్రూం, లేటిల్ సౌకర్యం కూడా లేదు. వర్షం వస్తే రేకుల షెడ్ కురుస్తుంది, అగ్నిమాపక సిబ్బంది ఉండే మార్కెట్ యార్డు లో ఎటు పక్క నుండి ఏ విష సర్పం వస్తుందో అర్థం కాని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉద్యోగ ధర్మాన్ని కాపాడుతున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఏమర్జన్సీ సేవలు చేసే వీరికి కనీస సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక ఫైర్ ఇంజన్ కైతే నీరు నింపుకోవడానికి ప్రత్యేకమైన బోరు సౌకర్యం మార్కెట్ యార్డ్ లో లేదు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏ మూల సమస్య వచ్చినా ముందుగా నిలబడే వీరికి మండల పరిధిలో అందుబాటులో ఎల్లప్పుడూ రెండు బోర్లు రెండు ఓవర్ ట్యాంకులు కేటాయించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అంతేకాకుండా చంద్రగిరి నియోజకవర్గం అంటే ముందుగా గుర్తొచ్చేది సీఎం సొంత ఊరు నారావారిపల్లి కి సీఎం వచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచే అగ్రిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లి ఎమర్జెన్సీ సర్వీసులు చేయాలి. సీఎం సొంత ఊరు సొంత నియోజకవర్గంలోనే అగ్నిమాపక సిబ్బందికి ఏలాంటి సౌకర్యాలు లేకపోతే ఏ విధంగా సర్వీస్ చేయాలని ప్రజల ఆలోచన, ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అగ్నిమాపక శాఖకు ప్రత్యేకంగా సొంత స్థలం కేటాయించి బిల్డింగ్ సౌకర్యాలు, బోరు సౌకర్యం కల్పించవలసినదిగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి.
