తిరుపతి జిల్లా – పాకాల : ఇండియన్ స్కూల్, పాకాల వేదికగా తిరుపతి జిల్లా జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక, పాకాల మండల శాఖ కార్య వర్గాన్ని ప్రకటించినట్లు తెలిపారు. అధ్యక్షులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొగరాల నుంచి భౌతిక రసాయన శాస్త్ర ఉపాద్యాయులు వనపర్తి వెంకట సిద్దులు,గౌరవాధ్యక్షులుగా ఇండియన్ స్కూల్ అధినేత సాత్యకి , ఉపాధ్యక్షులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఒడ్డేపల్లి పాఠశాల నుంచి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాకాల నుంచి జీవశాస్త్ర ఉపాధ్యాయులు జయచంద్ర, సహాయ కార్యదర్శిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓబులశెట్టి వారి పల్లి నుంచి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు కృష్ణబాబు , కోశాధికారిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దామలచెరువు నుంచి వ్యాయామ సంచాలకులు గణపతిని కార్యవర్గంగా ప్రకటించారు. తదుపరి జన విజ్ఞాన వేదిక గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో జనవిజ్ఞాన వేదికకు పూర్వ వైభవాన్ని తెచ్చి జనవిజ్ఞాన వేదిక ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కార్యసాధన కోసం సంసిద్ధులై కార్యవర్గమంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మధు, లక్ష్మి , షాతాజ్ లు పాల్గొన్నారు.
