తిరుపతి జిల్లా, పాకాల : టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్), లయన్స్ క్లబ్ దామలచెరువు సంయుక్త ఆధ్వర్యంలో గురువారం దామలచెరువులోని ఆర్ఆర్ కల్యాణ మండపంలో పింక్ బస్ ద్వారా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. 105 మంది విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దామలచెరువు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డి బాషా, రీజనల్ చైర్ పర్సన్ రామయ్య, స్విమ్స్ ఆసుపత్రి నుండి డాక్టర్ పద్మావతి, ప్రజాసంబంధాల అధికారి డి.చంద్రమోహన్, జోన్ చైర్ పర్సన్ నాగూర్ బాషా, సెక్రటరీ జిడి నాగూర్, కోశాధికారి నిజాముద్దీన్, సభ్యులు కెఎస్.మస్తాన్, ఇమ్రాన్, మాధవి, అన్సర్, ఏఎన్ఎం అమరావతి, ఇతర వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
