తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలంలోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణస్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. కమిటీల ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, తుడా ఛైర్మెన్ దివాకర్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి హాజరైనారు.
ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి…. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చంద్రగిరి నియోజవర్గంలోని ఆరు మండలాలలో పదవులు చేపట్టిన వారి చేత తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో నిరంతరం పాటుబడుతూ… నిస్వార్థం, అవినీతి- అక్రమాలకు పాల్పడకుండా దీక్షాదక్షతలతో, అంకితభావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడు కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని మండల, బూత్, క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ ల చేత ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. మన పార్టీ కార్యకర్తలు నాయకులు మృతి చెందిన వారందరికీ రెండు నిమిషాలు మౌనం పాటించారు. గత కొద్ది నెలల క్రితం పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు మృతితో నా మనసు కలత చెందింది. నాకు అత్యంత ఆప్త మిత్రుడిని కోల్పోయాను అందుకే రాబోయే జన్మదిన వేడుకలకు నేను దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ సహకరించండి. గత వైసిపి పాలనలో చెవిరెడ్డి తమ్ముడు వారి నాయకులు చేయని అరాచకాలు దౌర్జన్యాలు దాస్టికాలు ప్రజలకు తెలియంది కాదు. వేటగాడు పక్షుల కోసం గింజలు చల్లి వలతో పట్టినట్టు… గత వైసిపి పాలకుడు నియోజకవర్గ ప్రజలకు కానుకలు, డబ్బులను ఎరగా చూపి గెలవాలనుకున్నారు కానీ నియోజకవర్గ ప్రజలు తెలివైనవారు…. వైసిపి వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసిన.. చిత్తు చేస్తూ.. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కావాలన్నా ఉద్దేశంతోనే టిడిపిని గెలిపించారు. మన పాలనలో ఎన్నికలు ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉందామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు దగ్గర నుండి క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ & బూత్ కమిటీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు విధిగా పార్టీ విధి విధానాలను పాటించాలి. కమిటీలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రజలకు అందుబాటులో ఉండి.. పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం వారంలో ఐదు రోజులు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజాసమస్యలు తెలుసుకొని వీలైనంతవరకు సత్వరం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా… మరి కొన్ని సమస్యలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అప్పచెబుతాం …. నాకు కూడా కార్యకర్త కష్టాలు తెలుసు…. నేను కార్యకర్త స్థాయి నుండి ఎమ్మెల్యే వరకు అధినాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ… పార్టీ సిద్ధాంతాలకు లోబడి కస్టపడి వచ్చినవాడినే. కార్యకర్తనైన, నాయకుడైన, ఎవరినైనా ఒకే విధంగా గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకల ద్వారా పార్టీ కేడర్లో నూతన ఉత్సాహం రేకెత్తి, బలమైన సంస్థాగత నిర్మాణానికి దోహదం చేస్తుందని అన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు కొత్త కమిటీ సభ్యులను ప్రోత్సహించాలని కోరారు. ప్రతి నాయకుడు తన అధికారిక సోషల్ మీడియా పేజీలో వేడుకల ఫోటోలు, వీడియోలను షేర్ చేయాలని పిలుపునిచ్చారు. కొత్త కమిటీలతో తెలుగుదేశం పార్టీ గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలపడుతోందని, ఈ వేడుకలు కేవలం ఆచారపరమైనవి కాదు, అవి మన కేడర్లో ఐక్యత, ఉత్సాహం, నిబద్ధతకు ప్రతీక అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనాలు ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










