- వ్యాధి నిర్ధారణ కాకుండా యాంటీబయాటిక్స్ వాడటం ఆరోగ్యానికి హానికరం
- మితిమీరిన యాంటీ బయోటిక్స్ వాడటం ప్రాణాంతకం”
- ఏ ఎం ఆర్ ప్రపంచ ఆరోగ్యానికి పెద్ద సవాల్
- 38% ఐ. సి.యూ రోగులు ఆసుపత్రిలోని ఇన్ఫెక్షన్లు / ఏ ఎం ఆర్ ల కారణంగా 14 రోజుల్లో మరణిస్తున్నారు
- 83% మంది భారతీయులు ఔషధ నిరోధక బ్యాక్టీరియాను కలిగి ఉన్నారు
- ఇన్ఫెక్షన్లు రాకపోతే నిరోధకత తలెత్తదు
- ఏ ఎం ఆర్ ని ఎదుర్కోవడానికి కీలకం నివారణ
- నివారణా చర్యలతో ఏఎంఆర్ ను అరికడదాం
- ఏ ఎం ఆర్ నివారణకు వైద్యుల సలహా అవసరం
- ఇప్పుడే చర్య తీసుకోండి: మన వర్తమానాన్ని రక్షించుకోండి, మన భవిష్యత్తును సురక్షితం చేసుకోండి.
తిరుపతి పాకాల :ప్రపంచ యాంటి మైక్రోబియల్ అవగాహన వారోత్సవాలు – 2025 (నవంబర్ 18 నుండి నవంబర్ 24 వరకు) చివరి రోజులో భాగంగా పాకాల మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొగరాల నందు బ్రెయిన్స్ హాస్పిటల్, బెంగళూరు మరియు ప్రగతి గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్, కృష్ణాపురం వారు సంయుక్తంగా, ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్. ఆర్. నాగరాజ నాయుడు గారి ఆధ్వర్యంలో “యాంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏ ఎం ఆర్) పై విద్యార్థులకు అవగాహన కల్పించి తదుపరి మొగరాల గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యం చేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి. సుమలత గారు తెలిపారు .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజ నాయుడు గారు 2025 వారోత్సవాల నేపథ్యం: ఇప్పుడే చర్య తీసుకోండి: మన వర్తమానాన్ని రక్షించుకోండి, మన భవిష్యత్తును సురక్షితం చేసుకోండని గుర్తుచేశారు. మనల్ని రక్షించే మందులను ఆదాచేయలని, యాంటీ మైక్రోబియల్ నిరోధకతను నివారించి, ప్రాణాలను కాపాడాలని, ఇన్ఫెక్షన్లు రాకపోతే, నిరోధకత తలెత్తదన్నారు. ” వైద్యుల సలహా పాటించకుండా మితిమీరిన యాంటీ బయాటిక్స్ మందులను వాడటం వలన జనాంతర సూక్ష్మ జీవులు వాటి నిరోధకతను పెంచుకుని శరీరంలోనే ఉండి పోయి వ్యాధి వచ్చినప్పుడు వ్యాధి తీవ్రతను పెంచి రోగికి విపరీతమైన అనారోగ్యం కలుగజేసి మరణాన్ని కలుగజేస్తాయి. వ్యాధులను కష్టతరం చేసి వైద్య ప్రక్రియకు కూడా అడ్డంకిగా మారుతాయి. వీటిని ఎదుర్కోవడానికి వైద్యుల సలహా మేరకే యాంటీ బయాటిక్స్ మందులను వాడాలి, వ్యాధికి నివారణ చర్యలు చేపట్టాలి, కొత్త చికిత్సల ఆవశ్యకతను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శివముని, ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధులు, ఆదికేశవులు, విమలా విక్టోరియా, సుల్తాన్, బాబు, రామమూర్తి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










