తిరుపతి / పాకాల : మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పాకాల స్థానిక ప్రభుత్వా డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎస్ వి రమేష్ కుమార్ అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఇరంగారి పల్లిలో జరుగుతున్న ప్రత్యేక క్యాంపులో ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల చుట్టూ వివిధ రకాల పూల మొక్కలను నాటే కార్యక్రమంలో వాలంటీర్లతో కలిసి మొక్కలు నాటారు. “వృక్షో రక్షిత రక్షితః” అను మాటను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పిడి డాక్టర్ మాశిలామణి అధ్యాపకులు ఈశ్వరబాబు, రమణమ్మ, ఢిల్లీ ప్రసాద్ హెడ్మాస్టర్ ముని రాజారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.










