పాకాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఉచిత రేషన్ పథకం ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యవసర సరుకులను పేద ప్రజలకు చేరవేసే చౌక దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులకు కనీస వేతనం ఇవ్వాలని పాకాల మండలంలోని చౌక దుకాణా దారులు ద్వారా విజ్ఞప్తులు అందుతున్నాయి. ప్రభుత్వం తమకు ఇస్తున్న కమిషన్ ప్రస్తుతం పెరిగిన ఖర్చులకు సరిపోవడం లేదని తమకు కనీసం నెలకు 15 వేల నుంచి 20వేల రూపాయలు వేతనం చెల్లించాలి అని కూటమి ప్రభుత్వానికి రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ దీనిపైన దృష్టి సారించి కనీస వేతనం ప్రకటిస్తారని దుకాణాల యజమానులు ఎదురుచూస్తున్నారు.
