తిరుపతి : తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు బుధవారం బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతత్వం, తెలియజేస్తూ భారత రాజ్యాంగం ఆమోదించబడి 76 సంవత్సరములు కావస్తున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ముఖద్వారం నందు గల భారతరత్న, నవ భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహమునకు బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ పి.సి వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ ఎమ్. దాంలా నాయక్, డిప్యూటీ రిజిస్టర్, ముఖ్య సలహాదారు లు డాక్టర్, డి. గోవింద్ మరియు ఎంప్లాయిస్ ఫెడరేషన్ చీఫ్ కోఆర్డినేటర్ చింతమాకుల పుణ్యమూర్తి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర హైకోర్టు న్యాయవాది. సంయుక్త ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో స్మరించుకోవడం జరిగినది. ఇందులో భాగంగా బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్, చీఫ్ కోఆర్డినేటర్ చింతమకుల పుణ్యమూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించబడిన నాటి నుంచి పాలకులు సక్రమమైన పరిపాలన చేయడంలో కొన్ని లోపాలు తలెత్తుతున్నాయి, విద్యా ఉద్యోగ ఆరోగ్య ఉపాధి కల్పించడంలో పాలకులు భారత రాజ్యాంగాన్ని సరైనదిగా అమలుపరచడంలో విఫలం చెందారు, అవినీతి, నిరుద్యోగం, అనారోగ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలలో తాండవిస్తున్నాయి అని అన్నారు. భారత రాజ్యాంగం సక్రమమైన మార్గంలో అమలుపరచి ఉంటే ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థాయిలో నిలబడి ఉండేదని వ్యాఖ్యానించారు, డాక్టర్. డి. గోవింద్ మాట్లాడుతూ పీడిత, తాడిత, ప్రజలకు అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు అన్ని గ్రంథాల కంటే భారత రాజ్యాంగం అతి పవిత్రమైన గ్రంథమని వ్యాఖ్యానించారు. దార్ల రఘు రాములు, జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ ఆయన కుటుంబాన్ని పణంగా పెట్టి, నా కుటుంబం కంటే నా బిడ్డల కంటే ఈ దేశంలో అసమనాత్వాన్ని, బానిసత్వాన్ని, వెట్టి చాకిరి, అనుభవిస్తున్న నా బహుజనులకు ఖచ్చితంగా మేలు చేసే ప్రయత్నంలో ఉన్నాను, వారందరూ కూడా నా బిడ్డలేనని అతి గొప్ప నినాదంతో చెప్పారు, అటువంటి గొప్ప మహా మేధావి, మానవ దృక్పథం కలిగినటువంటి ప్రపంచ మానవత్వం కలిగిన మహనీయుడు భారత రాజ్యాంగ పితాహముడికి మేము ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటామని తెలిపారు. ఇందులో ఎస్. మునీశ్వరయ్య గౌడ్, సంయుక్త కార్యదర్శి. ఆర్గనైజింగ్ సెక్రటరీస్ జె. శంకర్ నాయక్, డి. ప్రతాప్, టి.సహదేవ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఎమ్. సిద్దయ్య, కె.ఎస్. గౌస్ బాషా, జె. అమర్నాథ్, కె. శోభన్ బాబు, ఆత్మకూరు సుధా ఎస్ పి బి. వల్లి, తదితర సంఘం నాయకులు అంబేద్కర్ ని ఘనంగా స్మరించుకోవడం జరిగినది.









