contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుంది : పులివర్తి నాని

తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ పుల్లావాండ్లపల్లెలో అన్నదాత సుఖీభవ ఇంటి ఇంటి ప్రచార కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం ప్రారంభించారు. ముందుగా పదిపుట్లబైలు పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే కి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రైతులు. ఎన్నికల సమయంలో రైతులకు సంవత్సరానికి 20 వేలు విడతల వారీగా ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం. 14 వేల రూపాయలను ఆగస్టు, నవంబర్ లో రెండు విడతలవారీగా రైతుల ఖాతాలో జమ చేసిందని తెలిపారు. ఇంటి ఇంటి వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం గురించి రైతులకు వివరించిన ఎమ్మెల్యే పార్టీ మూల సిద్దాంతంలో రైతు సంక్షేమం ఉందని పార్టీ జెండాలో నాగలి గుర్తు ఉందని కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో రెండవ విడతలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన 26062 మంది రైతులకు 17.61 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. సాదారణ రైతు కుటుంబం నుంచి బయటకు వచ్చి రాజకీయంలో తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రైతుల కష్టాలు తెలుసునని కష్టకాలంలో రైతులను ఆదుకునే దిశగా ముందుచూపుతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అందులోభాగంగా పలు దఫాలు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వారిని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతు కష్టాలను చూసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేజీకి 8 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతులకు సబ్సిడీ వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు, గోకులం షెడ్లు,యూరియా, విత్తనాలు, సెనగకాయలు, డ్రిప్పు పైపులు, ఇతర వస్తువులను సబ్సిడీ ద్వారా రైతులకు కూటమి ప్రభుత్వం అందించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం అందని రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ పట్టా పాస్ బుక్ కు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది అని ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమ పథకాన్ని రైతులకు వివరించడమే కాకుండా గ్రామంలోని సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ‌పాకాల మండలం పరిధిలోని పదిపుట్లబైలు, ఇతర పంచాయతీ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడం వలన ఏనుగుల సమస్య ఉందని, చంద్రగిరి నియోజకవర్గంలోని ఏనుగుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తున్న కూటమి ప్రభుత్వం.రైతులకు ముఖ్యవిజ్ఞప్తి వరి, మామిడి, అరటి ఇతర పంటలు కాకుండా సేంద్రియ పద్ధతిలో నూతన పంటలకు వెళ్ళాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :