- ఎం పీ డీ ఓ ఆదేశాలు సైతం అమలు కానీ దుస్థితి.
- బీ జే పీ వేంకటాద్రి నాయుడు
తిరుపతి జిల్లా, పాకాల : పాకాల మండలం లోని ఉప్పర పల్లె, చెన్ను గారి పల్లె, పంచాయతీ పరిధిలోని ప్రజలు గత ఆరు మసాలుగా దోమలు విపరీతంగా ప్రభలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు కొత్తపల్లి వెంకటాద్రి నాయుడు అన్నారు. దోమల బెడద తీవ్రంగా ఉందని పాకాల ఎం పీ డీ ఓ ని గ్రామ ప్రజలు కలిసి విన్నవించగా వెంటనే ఫాగింగ్ లేదా దోమల మందు పిచికారి చేయాలని ఆదేశాలు జారీ చేసి నెల రోజులు గడచినా…, సదరు పంచాయితీలోని సంబంధిత శాఖ అధికారులు ఎం పీ డీ ఓ మాటలను కూడా భేఖాతారు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇక ప్రైవేటు పాఠశాల యజమాన్యాలకు తల్లిదండ్రులు దోమల నివారణ పై స్పందించ మని చాలా సార్లు చెప్పిన తగు చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల టీచర్లు ఐతే సరే సరి విద్యార్థులే చందాలు వేసుకుని ప్రతి రోజు ఆలౌట్లు, జట్టు కాయల్సు, దోమల వత్తులు మీరే తీసుకుని వచ్చి వెలిగించుకోవాలి అని ఆదేశాలు జారీ చేయడం బాధాకరం. అసలే వర్షాకాలం వాగులు, వంకలు, కాలువలు ఇలా ఎక్కడా నీరు నిలువ ఉండటం ఇటు ప్రజలు మరియు విద్యార్థులు దోమల వల్ల విష జ్వరాలైన, టైఫాయిడ్, డెంగు, మలేరియా,బారిన పడే అవకాశం ఉన్నందున వెంటనే సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో వెంటనే స్పందించి పాకాల మండలంలో దోమల నివారణకై యుద్ధ ప్రతి పదికన చర్యలు చేపట్టే లా ఆదేశాలు జారీ చేయమని స్థానికులు మరియు బి జే పీ కొత్తపల్లి వెంకటాద్రి నాయుడు తిరుపతి జిల్లా కలెక్టర్ వారిని కోరుతున్నారు.










