తిరుపతి : 1993 సంవత్సరము మద్రాసు రాష్ట్రంలోని కడలూరు వద్ద బడుగు, బలహీన, గిరిజన, అణగారిన వర్గాల “ఇరులర్” తెగకు చెందినటువంటి ఒక మహిళ మీద జరిగినటువంటి దాడి, అన్యాయమైన కేసులు మోపబడిన విషయంలో, మద్రాసు హైకోర్టు న్యాయవాది సమక్షంలో, న్యాయ అన్యాయాలపై సుదీర్ఘ వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయం కోసం పోరాటం చేస్తున్నా బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేసే దిశగా విజయకేతనం ఎగరవేసి, భారతదేశం గర్వించదగ్గ ఒక ప్రముఖ విశిష్ట ప్రఖ్యాత న్యాయవాది జస్టిస్ కె. చంద్రు వారు 96 వేల కేసులు పరిష్కరించి ఉన్నారు, అందులో ముఖ్యంగా అణగారిన స్త్రీల కేసులనే వాదించి ఉన్నారు, వారు మద్రాసు హైకోర్టు న్యాయవాదిగా 2013లో పదవీ విరమణ చేశారు, వారు వాదించి విజయం సాధించిన కేసును ఆధారంగా చేసుకుని 2021లో “జై భీమ్” సినిమా తమిళనాడు, విఖ్యాత అభ్యుదయ భావాలు కలిగిన “జ్ఞాన వేలు” దర్శకత్వ ఆధ్వర్యంలో అన్ని భాషలలో అనువదిస్తూ విజయ బావుట ఎగురవేయడం జరిగినది. యావత్ భారత దేశం గర్వించి ఆలోచింపజేసినటువంటి, విశిష్ట ప్రఖ్యాత న్యాయవాది జస్టిస్ కె. చంద్రు ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి జిల్లా, బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్, అధ్యక్షులు సంగీతం సుబ్రమణ్యం, జనరల్ సెక్రటరీ మొండెం పద్మనాభం, వైస్ ప్రెసిడెంట్ గంధం బాబు, జాయింట్ సెక్రెటరీ ఎస్. మునీశ్వరయ్య గౌడ్, దార్ల రఘు రాములు, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఎస్. పి. భక్తర్ వల్లి, జె. శంకర్ నాయక్, డి.ప్రతాప్, టి. రాజేంద్రప్రసాద్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ జె. అమర్నాథ్, తదితరుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, గెస్ట్ హౌస్ నందు ఘనంగా సన్మానించడం జరిగినది.










