తిరుపతి రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న సమస్యలపై ఈనెల 9న జరిగే ‘అన్నదాత’ పోరును విజయ వంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెతు విభాగం జిల్లా అధ్యక్షులు మల్లం చంద్రమౌళి రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చంద్రగిరి నియోజక వర్గం పార్టీ కార్యాలయంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్ల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంట సాగుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని విమర్శించారు. వరి పంటకు సరిపడ యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. రబీ, ఖరీఫ్ సీజన్ లలో సాగుకు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందేలా జగనన్న ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువస్తే ఈ ప్రభుత్వం దానిని నాశనం చేసిందని విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రా ల్లో ఎరువులు పంపిణీ చేస్తే ఈ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తోదన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలించే ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్నదాత పోరుకు పార్టీ శ్రేణులంతా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజక వర్గం రైతు విభాగం అధ్యక్షులు భాస్కర్ నాయుడు, ఆరు మండలాల రైతు విభాగం అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, మారయ్య, శ్రీధర్, శ్రీనివాసులు రెడ్డి, మదనమోహన్ రెడ్డి, గిరిధర్ రెడ్డి లతో పాటు చంద్రగిరి మండలం పార్టీ అధ్యక్షులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నేతలు బుల్లెట్ చంద్రమౌళి రెడ్డి, శంకర్ యాదవ్, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, యశ్వంత్, అగరాల సర్పంచ్ భాస్కర్ రెడ్డి, దేవారెడ్డి, కోటీశ్వర రెడ్డి, నవీన్ రెడ్డి, రఫీ, వినాయకతో పాటు మరికొంత మంది నాయకులు వున్నారు.
