తిరుపతి : తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికురాలు హేమలతను పాము కాటు వేయడంతో మృతి చెందింది. పాము కాటు అనంతరం ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించడంలో కాంట్రాక్టర్ తీవ్రంగా ఆలస్యం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందకపోవడమే హేమలత మరణానికి కారణమని పేర్కొంటూ బంధువులు రుయా మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.










