తిరుపతి జిల్లా, పాకాల : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సదర్భంగా ఆదివారం పాకాల మండలంలో పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. మండలంలో ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగనన్న జన్మదినం వేడుకల్లో పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ వేడుకల్లో పాలు పంచుకున్నారు. పాకాల ఆర్టీసీ బస్టాండు వద్ద ముందుగా అంభేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గజ మాలతో నివాళులు అర్పించారు. అనంతరం జగనన్న పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసియున్న భోజనంను అందరికీ వడ్డించి ఆకలి తీర్చుకున్న ప్రతి ఒక్కరు జగనన్నను దీవించాలని విజ్నప్తి చేశారు. చివరగా జగనన్నపై అభిమానంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ప్రారంభించారు. అంతకు ముందు పాకాల మండలం కే.వడ్డేపల్లికి వెళ్లిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడి యువతతో కలసి జగనన్న జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సదర్భంగా పలువురు ఆటో డ్రైవర్లకు యూనిఫాం పంపిణీ చేశారు.










