contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆక్రమణలతో సగంకు తగ్గిన రోడ్డు వెడల్పు….

తిరుపతి జిల్లా పాకాల మండలంలో పాకాల – దామలచెరువు రోడ్డులో ఊట్లవారిపల్లె మీదుగా కృష్ణాపురం వెళ్లే రోడ్డు జాగా ఇటీవల కాలంలో సగం ఆక్రమణలకు గురైయింది. మరీ రామిరెడ్డి గారి ఇండ్లు మరియు ఊట్ల వారిపల్లెలో ఐతే రోడ్డు పైనే ఇల్లు,రేకుల షెడ్డులు, పూల తోటలు, ఆవుల పందిరిలు, కుంపట్లు, కూసాలు, రోడ్డుకు అడ్డంగా వెలిశాయి. ఊట్ల వారి పల్లెలో దగ్గరలో సచివాలయం ఉన్నా సచివాలయ సిబ్బంది ఇదే దారిలో రోజు నడుస్తూ ఆక్రమణలను ఎందుకో మరి చూసి చూడనట్టు వదిలివేయడం బాధాకరం. 45 అడుగుల రోడ్డు ఒక్కోచోట 10-15 అడుగులకు పరిమితమైంది. దీంతో ఈ మార్గంలో స్కూల్ పిల్లలు ప్రయాణించే బస్సులకు ప్రమాదం పొంచి వుంది. ఎదురుగా వేరే వాహనం వస్తే పక్కకు వెళ్లడానికి నిత్యం వాహనదారులు అవస్థలు పడాల్సీ వస్తుంది. ఊట్లవారి పల్లె అనుకుని వున్న కారణం చెరువు కట్టపై ఇబ్బందులు వర్ణనాతీతం ఇప్పటికే పలు ప్రమాదాల వలన ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి. రామిరెడ్డిగారి ఇండ్లు దగ్గరలో జ్యూస్ ఫ్యాక్టరీ ఉండడంతో పెద్ద లారీలు, మరియు కంటైనర్లు, ట్రాక్టర్లు ఈ మార్గంలో వెళ్తుంటాయి. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డును సర్వే చేసి రోడ్డు మీద వున్న ఆక్రమణదారులకు వెంటనే తోలగించి కబ్జాకు గురైన రోడ్డును పూర్తిస్థాయిలో వెడల్పు చేసి నిత్యం ట్రాఫిక్కు ఇబ్బందులతో సతమతమవుతున్న వాహనదారులకు ఊరట కల్పించాలని ఈ మార్గం గుండా ప్రయాణిచే వాహనదారులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :