తిరుపతి: తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ హాజరైనారు. ఎమ్మెల్యేలకు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు. ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధునికరణ మరియు ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు . 2024 ఎన్నికల సమయంలో మీడియా తరపున సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ ఆధునికరణమ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదములు తెలిపారు. గతంలో చెప్పిన విధంగా ప్రెస్ క్లబ్ కు 25 సెంట్లు స్థలం కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా అన్నారు. ప్రెస్ క్లబ్ కు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని మీడియా మిత్రులకు ఎమ్మెల్యే తెలిపారు. మీడియా మిత్రులు నాకు కుటుంబ సభ్యులు లాంటి వారు అని ఎమ్మెల్యే అన్నారు. గతంలో మీడియా మిత్రులకు ఇచ్చిన ఇంటి స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
