తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల జిల్లా పరిషత్ పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే పులివర్తి నాని సందర్శించారు. ముందుగా పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు .అనంతరం ఎమ్మెల్యే విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. పాఠశాలకు కావలసిన సౌకర్యాలు స్కూల్ హెడ్ మాస్టర్, విద్యార్థి కమిటీ సభ్యులు వినతిపత్రం రూపంలో అర్జీ ఇస్తే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో కొంతసేపు ముచ్చటించి ఎమ్మెల్యే పులివర్తి నాని సాధకబాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









