- ఓజోన్ పొర పరిరక్షణపై గ్రీన్ ర్యాలీ
- కాలుష్యాన్ని తగ్గించి ఓజోన్ పొరను రక్షింద్దాం
- భూమిపై జీవం ఉనికి ఓజోన్ పొరతో సాధ్యం
- మొక్కలు నాటుదాం ఓజోన్ పొరను రక్షిద్దాం
- ఓజోన్ పొర రక్షణతో భూతాపాన్ని తగ్గిదాం
- పర్యావరణ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన అవసరం
తిరుపతి – పాకాల : 38 వ “ప్రపంచ ఓజోన్ దినోత్సవం ” ను పురస్కరించుకుని పాకాల మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మొగరాల నందు నేషనల్ గ్రీన్ కార్ప్స్ .. గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్దులు ఆద్వర్యంలో ఎన్జీసి విద్యార్థులచే గ్రీన్ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం మొగరాల గ్రామంలో నిర్వహించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్దులు ఓజోన్ పొర రక్షణ, అవసరం, నివారణ మొదలగు అంశాలను విద్యార్థులకు తెలియజేస్తూ మనకు తెలుసో, తెలియకో మనం చేస్తున్న కొన్ని పనులు, ఒజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఎండ ,వేడి పెరిగినా, వానలు కురవకపోయినా, అడవులు తగ్గిపోయినా, కాలుష్యం ఎక్కువైనా… ఇలాంటి అనర్థాలన్నీ ఒజోన్ పొరను దెబ్బ తీస్తాయని, పాలపై మిగడ లా… ఈ ఒజోన్ అనే వాయువు.. భూమి చుట్టూ ఓ పొరలా అల్లుకుని ఉంటుందన్నారు. ఇది భూమి నుంచి స్ట్రాటో ఆవరణలో సుమారు 10 నుంచి 50 కిలోమీటర్ల మందంతో విస్తరించి ఉంటుందని, సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు (ultra violet rays) డైరెక్టుగా భూమిపై పడనివ్వ కుండా… ఒజోన్ పొర అడ్డు కుంటోందని, ఫలితంగా భగ భగ మండే కిరణాలు మనపై పడకుండా ఉంటున్నాయన్నారు. ఆ పొరే గనక లేకపోతే… ఆ కిరణాలు నేరుగా భూమిపై పడి మొత్తం ప్రాణి కోటి చనిపోయేదనీ, సమస్య ఏమిటంటే పెరుగుతున్న భూ తాపం (వేడి) వలన నానాటికి ఒజోన్ వాయువు తగ్గిపోతోందన్నారు.
1980లో మొదటిసారి ఒజోన్ పొరకు కన్నం పడిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారని, అందువల్ల భూమిపై నేరుగా సూర్యకిరణాలు పడుతున్న విషయం బయల్పడిందన్నారు. ఇలాగే పొర విచ్చిన్నం అవుతూ పోతే… కోట్ల మంది ప్రజలు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నిటి పై వ్యతిరేక ప్రభావం పడుతుందన్నారు. చర్మంపై తీవ్రమైన సూర్యకిరణాలు పడి… క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని, అంతేకాదు… పిల్లల పుట్టే అవకశాలు కూడా తగ్గిపోతుందన్నారు. ప్రస్తుతానికి అదే జరుగుతోంది కూడా అని అన్నారు. ఒజోన్ అంటే ఏమిటో, దాన్నే ఎలా రక్షించు కోవాలో తెలుపు కోవడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఒజోన్ పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారన్నారు. ఒజోన్ పొరను దెబ్బతీస్తున్న స్ప్రేలు, పోలాల్లో చల్లుతున్న ఎరువులు, క్రీమి సంహారాలు, కాలం చెల్లిన ఫ్రిడ్జులు, ఎయిర్ కండిషనర్లు కార్లపై వేసిన కలర్స్, పెర్ఫ్యూమ్లు, పెయింట్స్, క్లోరో ఫ్లోరో కార్బన్ల వంటివాటి వాడకాన్ని తగ్గించాలని కోరారు. ఒజోన్ పరిరక్షణ కోసం మొక్కలు, చెట్లు పెంచాలన్నారు. అడవుల నరికి వేతను అడ్డుకోవాలని, సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ ఎనర్జీ వాడకాన్ని పెంచడం ద్వారా… భూతాపాన్ని తగ్గించి ఒజోన్ పొరను కాపాడేందుకు వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు ఆదికేశవులు, విమలా విక్టోరియా, సుల్తాన్, నీరజ, రామమూర్తి, గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.