తిరుపతి జిల్లా, చంద్రగిరి : తిరుపతి జిల్లా చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పులివర్తి నాని హాజరుకాగా మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మండల సర్వసభ్య సమావేశాలు తూతూ మంత్రంగా జరిగేవని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు మారి ప్రజా సమస్యలు, సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. మండలంలోని గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎంపీపీలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను అడిగి తెలుసుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మండలంలోని వివిధ శాఖల అధికారులకు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు









