contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తిరుమల బ్రహ్మోత్సవాలకు 435 ఆర్టీసీ బస్సులను నడపనున్నాం: RTC RM జగదీష్

తిరుపతి:  తిరుమలలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సూచనల మేరకు తిరుపతి నుంచి తిరుమలకు 435 ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరుమల తిరుపతి మధ్య నడుపనున్నామనీ ఆర్టీసీ తిరుపతి రీజనల్ మేనేజర్ ఎం జగదీష్ తెలిపారు. ప్రతిరోజు కూడా లక్ష మంది భక్తులు ప్రయాణం చేస్తారని, సెప్టెంబర్ 28వ తేదీన గరుడసేవ ముందు రోజు రెండవ శనివారం రావడం వలన దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు పెరిగి ప్రయాణించే అవకాశం ఉందని దానికి తగ్గట్టు 435 బస్సులతో 3100 ట్రిప్పులు తిరగనున్నట్టు తెలిపారు. శ్రీ శక్తి పథకం వలన మహిళా ప్రయాణికులు అధికంగా ఉంటారని తెలిపారు. గత సంవత్సరం కన్నా 40000 వేల మంది భక్తులు అధికంగా తిరుమలకు ప్రయాణం చేసే అవకాశం ఉందన్నారు దాని తగ్గట్టు ఏర్పాటు చేశామన్నారు. బస్ సర్వీస్ లను తిరుమలకు వెళ్లే ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి అలిపిరి పాదాల వరకు 45 ఉచిత బస్సు సర్వీస్ లను నడుపనున్నట్టు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా చేపట్టినటువంటి శ్రీ శక్తి పథకాన్ని ఆర్టిసి లో మహిళా ప్రయాణికులు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారన్నారు. ఆగస్టు 15 నుంచి శ్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిందన్నారు. అంతకుముందు ఆర్టీసీలో ప్రతిరోజు మహిళలు 40 వేల మంది ప్రయాణించే వాళ్లని శ్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఆ సంఖ్య 80000 పెరిగిందన్నారు. సెప్టెంబర్ లో ఈ పథకాన్ని ప్రతిరోజు లక్ష మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. దాదాపు ఇప్పటివరకు మహిళలు 12.5 కోట్ల రూపాయలు ఇప్పటివరకు లబ్ది పొందారన్నారు. శ్రీ శక్తి పథకాన్ని ఆదరిస్తున్న మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :